Money Prasad in Temple : సాధారణంగా ఏ గుడికి వెళ్లినా భక్తులే డబ్బులను కానుకల రూపంలో ఆలయ హుండీల్లో వేస్తుంటారు. అదే తిరుపతి లాంటి ఆలయానికి వెళ్లితే తిరుమలేశుడికి నిలువుదోపిడీ ఇస్తుంటారు. తమ మొక్కులు చెల్లించుకుని కోరికలు నెరవేర్చమని భక్తులు దేవుడిని వేడుకుంటారు. అలాగే పూజారులు సైతం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తుంటారు. కానీ, ఓ ఆలయంలో మాత్రం భక్తులకు ప్రసాదానికి బదులు డబ్బులను పంచుతారు. అదీ దీపావళి పండుగ రోజున. మహారాష్ట్ర అమరావతిలోని ఉన్న కాళీమాత ఆలయంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దాదాపు 40 ఏళ్ల కిందట ఈ ఆచారాన్ని పూజారులు మొదలుపెట్టారు. దీపావళి రోజున రాత్రి 11 గంటల తర్వాత భక్తులకు డబ్బులను ప్రసాదంగా అందజేస్తారు.
Read Also: EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ
దీపావళి రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచిదని, అందుకే ఇలా చేశామని అమ్మవారి ఆలయ పూజారి శక్తి మహారాజ్ తెలిపారు. 1984లో తానే ఈ ఆచారాన్ని ప్రారంభించానని, అప్పటి నుంచి ప్రతేడాది దీపావళి రోజు డబ్బులను పంచుతామన్నారు. పెద్ద పాత్రలో పది రూపాయలు నోట్లు ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు అందజేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 3 గంటల వరకూ వితరణ చేశారు. అమ్మవారి ప్రసాదంగా భావించి ఈ డబ్బులు తీసుకోడానికి గుడికి భక్తులు పోటెత్తారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆలయాలు మూతపడ్డాయి. కోవిడ్-19 ప్రస్తుతం అదుపులోకి రావడంతో ఈ ఏడాది దీపావళి వితరణకు పోటెత్తారు.
Read Also: Vemula Prashanth Reddy: బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు.. ఇది కేసీఆర్ అడ్డా
శక్తి మహరాజ్ నుంచి డబ్బులు తీసుకుంటే అమ్మవారి ఆశీర్వదం లభించినట్టే భావిస్తారు. ఈ నోట్లను ఇంట్లో, తమ వ్యాపార కార్యాలయాలు, షాపులో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.