ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డ్ లభించింది. దీనితో వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది..
అందుకే ఈసారి పుష్ప ది రూల్ సినిమా ను అదిరిపోయే విజువల్స్ తో,భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో భారీ నిర్మాణ విలువలతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ సగానికి పైగానే పూర్తి అయ్యింది..అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ చెప్పారు..పుష్ప మెదటి భాగంలో దేవి శ్రీ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.రాబోయే పుష్ప రెండవ భాగం కోసం కూడా అదే రేంజ్ లో ఇవ్వడానికి దేవి శ్రీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.పుష్ప 2 సినిమాను సుకుమార్ పార్ట్ 1 ను మించిపోయేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని అలానే మూవీలో కొన్ని సాంగ్స్ కంపోజ్ చేయడం అయ్యిందని కూడా దేవిశ్రీ తెలిపారు. ఇక పుష్ప 2 లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి