త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే.. ప్రజలకు అండగా ఉండి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు. బుధవారం నాడు తర్లుపాడు మండలంలోని తర్లుపాడు బీసీ కాలనీ, నాయుడుపల్లి గ్రామాల్లో అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరిందని వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు అభ్యర్థించారు.
Read Also: Hari Hara Veera Mallu: డైరెక్టర్ క్రిష్‌ని తప్పించలేదు.. తప్పుకున్నాడు!
మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. మాట తప్పని.. మడమ తిప్పని నేత జగనన్న.. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జగనన్నది ఒక్కటే మాట అన్నారు. జగనన్న చేసేదే చెప్తారు.. చేయలేనిది చెప్పరూ.. హామీ ఇవ్వరని తెలిపారు. అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కోరుకుంటున్న జగనన్నకు అండగా ఉండాలని ఆయన అభ్యర్థించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాటపై నిలిచి.. అన్నీ హామీలను 99 శాతం నెరవేర్చి.. సీఎం జగన్ మాటపై నిలబడ్డారు. అందుకే అందరూ వచ్చే ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెల్లడించారు.
Read Also: Delhi : మహిళా కమిషన్ నుంచి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి హామీని ధైర్యంగా నెరవేరుస్తున్నారన్నారని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కోరుకోడని, సీఎం కుర్చీ కోసమే నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజలను మరోమారు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. కావున మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి ఫ్యాన్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండలంకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.