NTV Telugu Site icon

Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర

Devara Ntr

Devara Ntr

Devara: తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే చరిత్రను తిరగరాసే వాళ్లు ఉంటారు. ముఖ్యంగా అతి కొద్ది మంది స్టార్ హీరోలే వరుస హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉంటారు. వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆయన రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఇప్పుడు ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు జనం నీరాజనం పలికారు.

Read Also:IFS Officer: డాక్టరును మోసం చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, భర్త.. రూ. 64 లక్షలు స్వాహా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న మాస్ ఫాలోయింగ్ తో కలెక్షన్ల దుమ్ము దులిపేశారు. తన ఫాలోయింగ్ కి తగ్గట్టు ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో తన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర”తో బాక్సాఫీస్ కు చూపించాడు. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ మొదటి రోజు రికార్డ్ వసూళ్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ తన స్టామినా ఏంటో చూపించేశాడు. ఇలా లేటెస్ట్ గా దేవర సినిమా అమెరికా మార్కెట్ సంచలన వసూళ్లను సాధించింది.

Read Also:Japan PM: జపాన్ ప్రధానిగా మాజీ రక్షణమంత్రి ఇషిబా

ఒక్క నార్త్ అమెరికా లోనే దేవర ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని అందుకుని మరే భారతీయ సినిమా అందుకోని రికార్డును నెలకొల్పింది. పూర్తిగా ఒక రోజు కాకుండానే దేవర ఈ రేంజ్ విలయ తాండవం చేస్తున్నాడంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి భారీ వసూళ్లు అందుకుంటున్న దేవర యూఎస్ మార్కెట్ లో ఇంకెలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.

Show comments