NTV Telugu Site icon

Devara : “ఫియర్ సాంగ్” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..

Devara

Devara

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సిఎంమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ అయిన “ఫియర్ సాంగ్ ” ను రిలీజ్ చేసారు.”దూకే ధైర్యంగా జాగ్రత్త ..దేవర ముందు నువ్వెంత ” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read Also :Kajal Aggarwal : కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన ఆ పనికి ఎమోషనల్ అయిన కాజల్..

అయితే మేకర్స్ రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ లో లిరిక్స్ లేకుండా కేవలం విజువల్స్ చూపించడం జరిగింది.అయితే ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విజువల్స్ ఎన్టీఆర్ విజువల్స్ ని డామినెటే చేశాయని న్యూస్ వచ్చింది.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేసారు.తాజాగా మేకర్స్ ఈ సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేసారు.ఈ వీడియోలో ఎన్టీఆర్ విజువల్స్ ఎక్కువ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే దేవర సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.తాజాగా వారు అనుకున్న తేదీ కంటే ముందుగా సెప్టెంబర్ 27 న రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా ఓ స్పెషల్ పోస్టర్ రిలీస్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

Show comments