NTV Telugu Site icon

Devara : రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న దేవర ‘ఫియర్ సాంగ్ ‘..

Ntr

Ntr

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దేవర మూవీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజ్ కానున్నది .

Read Also :Satyabhama : కాజల్ ‘సత్య భామ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ,గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ దేవర చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అయిన ‘ఫియర్ సాంగ్”ను రిలీజ్ చేసారు.”దూకే ధైర్యంగా జాగ్రత్త..దేవర ముందు నువ్వెంత”అంటూ సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు,నెటిజన్స్ కు విపరీతంగా నచ్చింది.అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన ఫియర్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఫియర్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ఇప్పటిరకు 50 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించి టాప్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.