Ram Pothineni : దేవదాసు టు స్కంద..రామ్ 18 ఇయర్స్ జర్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..2006లో వచ్చిన దేవదాసు సినిమాతో వెండి తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్‌కు ఎంట్రీతోనే సూపర్ హిట్ ను అందించింది.ఆ తర్వాత రామ్ జగడం, రెడీ, కందిరీగ, మస్కా, ఒంగోలు గిత్త, నేను శైలజ మరియు ఉన్నది ఒకటే జందగీ వంటి సినిమాలతో ఎనర్జిటిక్ హీరోగా మంచి ఫేం సంపాదించుకున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం మరో సారి పూరి దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.రామ్ గతేడాది స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ రామ్ పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ 18 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్ జర్నీని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మరియు మూవీ లవర్స్ రామ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ సినిమా ప్రయాణాన్ని తెలియజేస్తూ.. అభిమానులు ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌ను రామ్‌తో లాంఛ్ చేయించారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ మరిన్ని సినిమాలతో వినోదాన్ని అందిస్తూ తన జర్నీ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ప్రస్తుతం రామ్ నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంను పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి తాజాగా రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య స్టైలిష్‌గా ఉన్న లుక్‌ను విడుదల చేయగా ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతుంది.డబుల్ ఇస్మార్ట్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
NBK-RApo Mutual Calendar Launch by Ustad RAmPOthinen 💥♥️#NBK #RAmPOthineni @ramsayz @ramfanboy #NandamuriBalakrishna
— NBK UPDATES (@NbkUpdates) January 11, 2024
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!