Site icon NTV Telugu

Thirupathi Train: పట్టాలు తప్పిన తిరుపతి-తిరువనంతపురం రైలు.. తప్పిన ప్రమాదం

Train

Train

ఇటీవల వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒడిశాలో కోరమాండల్ రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు కూడా కావడంలేదు. ఆ రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో భారీ నష్టం.. జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగలేదు. రెండు రోజుల క్రితం వందేభారత్ రైలులో మంటలు చెలరేగి.. ప్రయాణీకులు పరుగులు పెట్టారు.

Janhvi Kapoor: జాన్వీ జిగేల్.. కుర్రాళ్ళ గుండెలు గుభేల్

అయితే తాజాగా.. తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు తప్పింది. కేరళలోని తిరువనంతపురానికి వెళుతున్న తిరుపతి-తిరువనంతపురం ట్రైన్ చివరి బోగి పట్టాలు తప్పింది. ఐదో ఫ్లాట్ ఫార్మ్ ట్రాక్ చేంజింగ్ పాయింట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఓ బోగి పట్టాలు తప్పి కొంత దూరం వెళ్లిపోయింది. దీంతో పక్క ట్రాక్ లో ఉన్న సిమెంట్ దిమ్మలు దెబ్బతిన్నాయి. ఆ బోగి పక్కకు ఒరిగిపోయింది. వెంటనే గుర్తించిన అధికారులు.. పట్టాలు తప్పిన కోచ్ ను తొలగించేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. మరోవైపు పట్టాలు తప్పిన కోచ్ లో ప్రయాణికులెవరూ లేరు. దీంతో ఎటువంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనపై పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Exit mobile version