NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష.. నిధులు, ఖర్చులపై ఆరా..!

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు.. ఇక, ఈ సమావేశంలో.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ పని తీరుపై డిప్యూటీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు.. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు.. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన రూ.1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ.. స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.

Read Also: Tirumala: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్ల విక్రయాలు.. నిమిషాల వ్యవధిలోనే..

కాగా, కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలను తీసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వరుసగా తన శాఖలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం విదితమే.. ఇక, రేపు పంచాయతీ రాజ్ రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా మీద సమీక్షించోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. మరోవైపు.. ఇప్పటికే ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటున్నారు.. ఈ నెల 29వ తేదీన కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కు చెల్లించుకోనున్నారు.. ఆ తర్వాత జులై 1వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్తున్నారు.. పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగనున్న విషయం విదితమే.