Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు.. ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు.. దీని కోసం మండలం యూనిట్‌గా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.. ఇక, 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్..
Read Also: Hemant Soren: నాపై అసత్య ప్రచారానికి బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేసింది..
అయితే, భవనాలకు రంగులపై కౌన్సిల్ లో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.. 49.8 కోట్లు పెయింట్లు, 59.72 కోట్లు రీ పెయింటింగ్ కు వినియోగించారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్.. గ్రామీణ గిరిజన విలక్షణ రంగులు టెర్రాకోట్ లో వేశారు.. 4800 కోట్లు రంగులకేనా..? ఇది గ్రామ సచివాలయాలకు వేసినవే..? అంటూ విమర్శలు గుప్పించారు.. త్వరలోనే డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకువస్తాం. 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్లు ఆదాయం సమకూరింది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు.. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం. బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం అన్నారు.. సర్వీస్ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారని పేర్కొన్నారు.. అన్ని అనర్ధాలకు ఒకే ఐఏయస్ కారణం. ఏ సమీక్ష చేసినా… ఆయనే మూల కారణం అంటున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..