Site icon NTV Telugu

Deputy cm Narayanaswamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్

Narayan

Narayan

మాజీ సీఎం. ఏపీ విపక్షనేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. పేదవారిని దగ్గర తీసుకున్న చరిత్ర నీకుందా చంద్రబాబు? సత్య హరిశ్ఛంద్రుడిని జగన్ రూపంలో చూశాం. 175 సీట్లు గెలిచేందుకు కుప్పం నాంధి పలుకుతుంది. పులివెందులకు ధీటుగా కుప్పంలో మెజారిటీ రాబోతోంది. దొంగ ఓట్లతో 6 పర్యాయాలు గెలిచావ్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఏనాడైనా పేదల అకౌంట్లలో రూపాయి అయినా వేశావా? కుప్పం ఎప్పుడొచ్చినా చంద్రబాబు రచ్చ పచ్చ చేస్తాడన్నారు.

చంద్రబాబు…ఔరంగజేబు ఒక్కటే.. మామను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. నీ తమ్ముడుని మానసిక సంక్షోభంతో ఇంటికే పరిమితం చేశావ్.. చంద్రబాబు పగ, ఈర్ష్య, ద్వేషంతో పుట్టాడు.. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుల,మతాలను రెచ్చగొట్టే వ్యక్తి నువ్వు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసరడం కాదు.. జడ్ కేటగిరీ భద్రత లేకుండా నువ్వ్వు రావాలన్నారు నారాయణస్వామి.

సారాను తీసుకొచ్చిందే టీడీపీ. మద్యం మీద బ్రతికిందే టీడీపీ.. నేనేమీ పారిపోను …మద్యం పై చర్చించడానికి ఎప్పుడూ సిద్ధమే. టైం ఇస్తే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు నారాయణస్వామి. ఇటు శాసనసభలోనూ తీవ్రస్థాయిలో టీడీపీపై ధ్వజమెత్తారు నారాయణస్వామి. కులవ్యవస్థ, మత వ్యవస్థని తెచ్చింది మీరు. రామారావు గురించి మాట్లాడితే ఎవరూ వినరు. అసలు మీకు ఆ అర్హత లేదన్నారు. 22 మంది మొత్తం వచ్చినా జగన్ ని ఏం పీకలేరు.

Read Also:Students Self Distraction: మూడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన

Exit mobile version