Site icon NTV Telugu

ACB Raids: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన డీఈఓ, జూనియర్ అసిస్టెంట్..!

Acb Raids

Acb Raids

ACB Raids: ములుగు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) చేసిన మేజర్ ఆపరేషన్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కన్నాయిగూడెం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి జాయినింగ్ ఆర్డర్ కోసం డీఈఓ కార్యాలయంలో 20 వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రైడ్ నిర్వహించారు.

Read Also: CM Revanth: వైద్య క‌ళాశాల‌ల ప‌నుల‌పై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌.. అధికారులకు సీఎం ఆదేశం..!

ఈ సమయంలో డీఈఓ పాణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ లు బాధితుడి నుండి 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనితో ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ములుగు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. డీఈఓ కార్యాలయంలో లంచం వంటి వ్యవహారాలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.

Read Also: Minister Seethakka: కేటీఆర్‌ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు.. మంత్రి ఆసక్తికర వాఖ్యలు..!

Exit mobile version