NTV Telugu Site icon

Bakrid Goat Cost : వామ్మో.. ఒక్క గొర్రె రూ.7.5 లక్షలు.. బక్రీద్ ఎఫెక్ట్..

Bakrid

Bakrid

Goat Cost : ముస్లిం సోదరుల రెండవ అతిపెద్ద పండుగ బక్రీద్‌ సోమవారం నాడు జరుపుకోనున్నారు. సోమవారం బక్రీద్ ( Bakrid ) సందర్భంగా ముస్లింలు త్యాగానికి గుర్తుగా గొర్రెలు, మేకలను బలి ఇస్తారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు గిరాకీ ఎక్కువ. ఫలితంగా, ఈ సమయంలో వాటిపై డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మేకలు, గొర్రెలను వేలంలో విక్రయిస్తున్నారు.

Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”

తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ నగరంలో జరిగిన వేలంలో “టొరంటో” అనే రెండేళ్ల గొర్రెను ఆకర్షణీయమైన ధరకు విక్రయించారు. బాగా లావుగా ఉన్న టొరంటోను ఏకంగా రూ.7.5 లక్షలకు వేలం వేయబడింది. పూణేకు చెందిన ఓ వ్యాపారి 161 కిలోల ఈ గొర్రెను రూ.7.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

GHMC Official Transferred: కూల్చివేతలో భాగంగా అధికారిపై బదిలీ వేటు..

భోపాల్‌లో జరిగిన వేలంలో ఏకంగా 40 కేజీల బరువున్న కాశ్మీరీ తుఫాన్ గొర్రె 7 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక్కడ విశేషమేమిటంటే., ఈ ప్రత్యేక గొర్రెలను ప్రదర్శనలో వేలం వేయగా అవన్నీ అమ్ముడయ్యాయి. రాఫ్తార్ అనే గొర్రె 141 కిలోలు, నూరా అనే గొర్రె 145 కిలోలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో కూడా బక్రీద్ గురించి హడావిడి నడుస్తోంది. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో దాదాపు 100 మంది వ్యాపారులు జయగూడ మార్కెట్‌లో గొర్రెలను విక్రయిస్తుంటారు. అయితే బక్రీద్ సందర్భంగా సుమారు 300 మంది వ్యాపారులు గొర్రెలను విక్రయించారు. బక్రీద్ సందర్భంగా బలి ఇవ్వడానికి ప్రధానంగా 11 నుంచి 14 కిలోల బరువున్న గొర్రెలను కొనుగోలు చేస్తారని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 12 కిలోల గొర్రె రూ.12 వేలు పలుకుతున్నట్లు సమాచారం.