Dell Alienware: భారత మార్కెట్లో డెల్ (Dell) కొత్తగా Alienware 16X Aurora, Alienware Area-51 16, Alienware Area-51 18 గేమింగ్ ల్యాప్‌టాప్ లను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు తొలిసారిగా CES 2026లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించగా.. ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్త మోడళ్లలో అత్యాధునిక ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు, ఎన్విడియా జిఫోర్స్ ఆర్‌టిఎక్స్ 50 సిరీస్ గ్రాఫిక్స్, OLED డిస్‌ప్లేలు, అధునాతన కూలింగ్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Alienware 16X Aurora:
Alienware 16X Auroraలో ఇంటెల్ కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం గరిష్టంగా NVIDIA GeForce RTX 5070 Ti Laptop GPUను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల WQXGA OLED డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, 0.2ms రెస్పాన్స్ టైమ్, HDR True Black 500, 100% DCI-P3 కలర్ గామట్, NVIDIA G-SYNC వంటి ఫీచర్లు ఉన్నాయి. యాంటీ-గ్లేర్ OLED ప్యానెల్ కారణంగా స్క్రీన్‌పై రిఫ్లెక్షన్ తగ్గడంతో పాటు వేలిముద్రలు కూడా తక్కువగా కనిపిస్తాయి. గేమింగ్ సమయంలో వేడిని సమర్థవంతంగా నియంత్రించేందుకు Cryo-ఛాంబర్ కూలింగ్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగించారు. అలాగే F7 కీతో యాక్టివేట్ అయ్యే Stealth Mode ద్వారా ఫ్యాన్ శబ్దం తగ్గి, కీబోర్డ్ లైటింగ్ తెలుపు రంగులోకి మారుతుంది.
Alienware Area-51 16, Area-51 18:
Alienware Area-51 సిరీస్‌లో 16, 18 అంగుళాల మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ అల్ట్రా 290HX Plus ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా NVIDIA GeForce RTX 5090 Laptop GPU వరకు ఎంపికలు ఉన్నాయి. Area-51 16లో 16 అంగుళాల WQXGA OLED డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, 0.2ms రెస్పాన్స్ టైమ్ లభిస్తాయి. ఇక Area-51 18లో 18-అంగుళాల QHD+ డిస్‌ప్లే, 300Hz రిఫ్రెష్ రేట్, 3ms రెస్పాన్స్ టైమ్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు 240W నుంచి 280W వరకు Total Performance Power (TPP)ను సపోర్ట్ చేస్తాయి. ఇందులో గరిష్టంగా 64GB DDR5 RAM, 12TB వరకు RAID 0 స్టోరేజ్, Thunderbolt 5, Wi-Fi 7, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, AlienFX RGB కీబోర్డ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ధరలు:
డెల్ కొత్త Alienware ల్యాప్‌టాప్‌లు అధికారిక వెబ్‌సైట్, డెల్ ప్రత్యేక స్టోర్‌లు, ప్రముఖ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
* Alienware 16X Aurora – రూ. 2,62,990
* Alienware Area-51 16 – రూ. 3,97,960
* Alienware Area-51 18 – రూ. 3,95,200
కొత్త ల్యాప్‌టాప్‌ల కొనుగోలుదారులకు డెల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Alienware 16X Auroraపై కేవలం రూ.999కే ఒక సంవత్సరం అదనపు వారంటీ పొందవచ్చు. అలాగే Area-51 16, Area-51 18 మోడళ్లకు రూ.7,999తో ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ అందిస్తోంది. వీటితోపాటు రూ.8,599 విలువైన Alienware హెడ్‌సెట్‌ను రూ.2,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

