Site icon NTV Telugu

Chattarpur : స్టేజ్ పైనే చెప్పుతో కొట్టిన మహిళ.. షాక్ తిన్న నాయకులు

Chattarpur

Chattarpur

Chattarpur : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్తార్‌పూర్‌ ఏరియాలో సభా వేదికపైనే ఒక మహిళ ఓ నాయకుడిని చెప్పుతో కొట్టింది. దాంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఇటీవల శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు అలాంటి బాధిత మహిళలకు న్యాయం చేయాలని, మహిళలకు అండగా నిలవాలని కోరుతూ ఛత్తర్ పూర్ ప్రాంతంలో సభ ఏర్పాటు చేశారు. ‘హిందూ ఏక్తా మంచ్’ ఆధ్వర్యంలో.. ‘భేటీ బచావో’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తన సమస్య చెప్పుకుంటానంటూ ఓ మహిళ వేదికపైకి వచ్చింది.

Read Also:Case on Chicken : కోడి పై కేసుపెట్టిన మోడీ.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

వచ్చీ రావడంతోనే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మొదలుపెట్టడంతో పక్కనున్న ఓ నేత ఆమెనుంచి మైకు దూరం పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొద్దిసేపు ప్రసంగించిన మహిళ తన పక్కనున్న వ్యక్తిని తోసేసి, చెప్పు తీసి అతడిపై దాడి చేసింది. షాక్‌కు గురైన చుట్టుపక్కల వాళ్లు తేరుకుని, ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆగలేదు. చెప్పుతో కొడుతూనే ఉంది. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. తన పక్కన నిలబడ్డ ఆ వ్యక్తి తనను ఇబ్బంది పెడుతూ, పక్కకు తోసేసేందుకు ప్రయత్నించాడని, మైక్ లాక్కునేందుకు చూశాడని.. అందుకే అతడిని చెప్పుతో కొట్టానని ఆ మహిళ చెప్పింది. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version