Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్

  • ఢిల్లీలో మరో ఘోర ప్రమాదం
  • సీమాపురిలో కూలిన మూడు అంతస్తుల భవనం
  • శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది
Delhi2

Delhi2

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సీమాపురిలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు ఉన్న భవనంలోని కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుని ఉండవచ్చనే భయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం, లోపల ఎంతమంది చిక్కుకున్నారనే సమాచారం తెలియలేదు. ప్రమాదానికి గల కారణం కూడా అస్పష్టంగా ఉంది. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.