Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన విధ్వంసకర బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు బుధవారం రాత్రి ఆలస్యంగా నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించగా.. ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% సరిపోలింది. 12 మందిని బలి తీసుకున్న, 20 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఢిల్లీ కార్ బాంబు దాడిని ఉగ్రవాది ఉమర్ నిర్వహించాడని నిర్ధారణ అయ్యింది.
READ MORE: Astrology: నవంబర్ 13, గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
దాడికి ఉపయోగించిన తెల్లటి హ్యుందాయ్ ఐ20 కారును పేలుడుకు 11 రోజుల ముందు కొనుగోలు చేసిన డాక్టర్ ఉమర్ దాడికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి అనుమానించాయి. అతను ఫరీదాబాద్‌లోని వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. పుల్వామాలోని సంబురాలో నివసించే ఉమర్ కుటుంబ సభ్యులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ప్రశ్నించింది. ఒమర్ తల్లి, సోదరుడు DNA నమూనాలను అందించారు. ఇవి పేలుడులో ఉపయోగించిన కారు శిథిలాలలో లభించిన అవశేషాలతో (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) సరిపోలాయి. మూలాల ప్రకారం.. ఉమర్ తీవ్రవాదం వైపు మళ్లినట్లు కుటుంబానికి ఇప్పటికే తెలుసు. కానీ వారు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదు. సెషన్ యాప్ ద్వారా ఉమర్ టర్కీలోని అంకారాలో ఉన్న తన హ్యాండ్లర్ ‘ఉకాసా’ (సంకేతనామం)తో నిరంతరం సంప్రదింపులు జరిపేవాడు.
READ MORE: RakulPreet Singh : బాబోయ్.. బికినీలో మొత్తం చూపించేసిన రకుల్ ప్రీత్
