ఢిల్లీ మెట్రో రోజురోజుకు ఫెమస్ అవుతుంది.. ఏదొక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. మొన్నటివరకు మెట్రో లవర్స్ కు రొమాన్స్ కు అడ్డా మారింది.. కొన్నిసార్లు ఏమో ఆడవాళ్ల పొట్లాట్లకు కేరాఫ్ గా నిలిచింది.. ఇకపోతే సీటు కోసం ఆడవాళ్లు గొడవపడుతున్న వీడియోలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు ఫైటింగ్ చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. వారిని ఓ మహిళా పోలీస్ అడ్డుకోవటంతో పెద్ద ఘర్షణకు దారితీయకుండా వివాదం సద్దుమణిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. మెట్రో కోచ్‌లో ఇద్దరు మహిళలు వాదులాడుకోవటం వీడియోలో చూడొచ్చు. ఆ వైరల్ అవుతున్న వీడియోలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న మహిళ మరీ రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇద్దరు మహిళలను వారించేందుకు అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించినప్పటికీ ఘర్షణ సర్దుమణగలేదు.
బ్లాక్ డ్రెస్ వేసుకున్న మహిళ నేను జడ్జి కుమార్తెను అంటూ పోలీసుపైసైతం రెచ్చిపోయింది. మరో మహిళ నేను ఏం తప్పు చేయలేదు. ఎవరిపైనా శారీరకంగా దాడి చేయలేదని చెప్పింది.. చివరికి స్టేషన్ రావడంతో అక్కడ ఉన్న వాళ్లు వాళ్ళని దిగమని చెప్పారు.. దాంతో ఇద్దరు దిగడంతో గొడవ సర్దు మణిగింది..మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఈ ఆడవాళ్లు ఎక్కడున్నా కూడా ఇంతేనా.. వీళ్లు మారరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది..
Kalesh inside delhi metro b/w Two woman, a lady cop interfere 🫡 pic.twitter.com/zlQ7gUyZ2F
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 2, 2023