Delhi Metro Viral Video : ఢిల్లీ మెట్రోలో రీల్స్ తీసే సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. మెట్రోలో రోజుకో కొత్త వీడియో తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. హోలీకి సంబంధించిన కొత్త వైరల్ వీడియోతో ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో లోపల నేలపై కూర్చొని హోలీ సాకుతో సినిమా పాటపై అసభ్యకర చర్యలు చేయడం చూడవచ్చు. మరోవైపు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ వైరల్ వీడియోను వివిధ మార్గాల్లో షేర్ చేస్తూ, నోటికొచ్చిన కామెంట్ చేస్తున్నారు.
హోలీ రంగులు వేసుకుని ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం ఢిల్లీ మెట్రోలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తెల్లటి చీర, సూట్ ధరించిన ఇద్దరు అమ్మాయిలు మెట్రో లోపల ఒకరికొకరు అసభ్యంగా రంగులు పూసుకుంటున్నారు. దీపికా పదుకొణె, రణబీర్ సింగ్ నటించిన రామ్ లీలా చిత్రంలోని ప్రసిద్ధ పాట ఆంగ్ లగా దే రే, మోహే రంగ్ లగా దే రే, మైన్ తో తేరీ జోగనియా పాటకు వీరు పెదాలు కదుపుతూ రంగులు నృత్యం చేశారు. ఇది మొదటి సంఘటన కాదు. ఇంతకుముందు, మెట్రోలో అమ్మాయిలు పోల్ డ్యాన్స్, హస్తప్రయోగం, మెట్రో లోపల ఓరల్ సెక్స్ వీడియోలు కూడా బయటపడ్డాయి.
Happy Holi friends from all the way metro 🎉🎉 #holi #happyholi pic.twitter.com/H0sExl9Brp
— S M Faris (@farismohaab) March 22, 2024
ఈ అమ్మాయిలు కాకుండా, ఇతర ప్రయాణికులు మెట్రో కోచ్‌లో కేవలం 45 సెకన్ల ఈ వీడియోలో కనిపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో SM Faris @farismohaab అనే హ్యాండిల్‌తో ఒక వినియోగదారు షేర్ చేసారు.
