Son Attack: చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు యత్నించాడు ఓ కసాయి కొడుకు. తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన కుమారుడు డబ్బులకోసం వారిని చంపేందుకు కూడా వెనకాడలేదు. ఈ ఘటన ఢిల్లీలోని ఫతే నగర్‌లో చోటుచేసుకుంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారని కన్న తల్లిదండ్రులను కడతేర్చేందుకు యత్నించిన 34 ఏళ్ల ఓ సుపుత్రుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన వారిద్దరిని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ తండ్రి స్వర్ణజిత్ సింగ్(65) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. తల్లిని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఈ సారి ఆవు వంతు..
తల్లి అజిందర్ కౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, కానీ ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఘనశ్యామ్ బన్సల్ తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని ఫతే నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని, నిందితుడు జస్దీప్ సింగ్ తన తల్లిదండ్రుల నుండి డబ్బు డిమాండ్ చేయగా, వారు నిరాకరించారని డీసీపీ తెలిపారు. అయితే నిందితుడు దాదాపు రూ.7 లక్షల వరకు స్టాక్ మార్కెట్‌లో పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో తన తల్లిదండ్రులు డబ్బులు అడిగాడని, వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో హతమార్చేందుకు యత్నించాడని వెల్లడించారు.
