Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man with 46,XY Chromosomes Diagnosed with Rare PMDS: ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల పెళ్లయిన ఓ యువకుడు సంతానలేమి సమస్యతో రాజౌరి గార్డెన్‌లోని ఒక ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి రకరకాల పరీక్షలు చేయగా, అందులో స్పెర్మ్ కౌంట్ పూర్తిగా సున్నా అని తేలింది. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు స్కానింగ్, పెల్విక్ ఏరియా ఎంఆర్ఐ (MRI) చేసి చూసిన వైద్యుల బృందం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఒక పురుషుడి కడుపులో గర్భాశయం (యూట్రస్), ఫెలోపియన్ ట్యూబ్‌లు ఉన్నట్లు ఆ నివేదికల్లో స్పష్టంగా కనిపించింది. బయటకు పూర్తి పురుష లక్షణాలతో, సాధారణ శరీరాకృతితో ఉన్న ఆ వ్యక్తికి లోపల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండటం ఆ ఆసుపత్రి చరిత్రలోనే మొదటిసారిగా వైద్యులు చెబుతున్నారు.
ఈ విచిత్రమైన కేసును పర్యవేక్షించిన డాక్టర్ సుశీల్ ఖర్బందా మాట్లాడుతూ.. ఈ విషయం బయటపడగానే ఆ యువకుడికి జెనెటిక్స్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో అతని క్రోమోజోమ్ ప్యాటర్న్ సాధారణ పురుషుల్లో ఉండేలాగే ’46,XY’ అని వచ్చింది. అంతా మామూలుగానే ఉన్నా, అతని వృషణాలు (టెస్టికల్స్) ఉండాల్సిన చోట కాకుండా పొత్తికడుపు లోపలే ఉండిపోయాయి. దీనికి గల కారణాలను విశ్లేషించిన వైద్యులు, ఆ యువకుడు ‘పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్’ (PMDS) అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. వైద్య చరిత్రలోనే ఇలాంటి కేసులు చాలా అరుదుగా నమోదువుతుంటాయి.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సాధారణంగా తల్లి గర్భంలో మగ పిండం ఎదుగుతున్న తొలి రోజుల్లో తాత్కాలికంగా గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. మగ పిల్లవాడు జన్మించే సమయానికి శరీరంలోని హార్మోన్ల ప్రభావం వల్ల ఇవి పూర్తిగా నశించిపోతాయి. కానీ పిఎమ్‌డిఎస్ (PMDS) అనే జన్యు లోపం ఉన్న పిల్లల్లో ఇవి కరిగిపోకుండా శరీరంలోనే ఉండిపోతాయి. ఈ సమస్య ఉన్నవారికి బయటకు పురుష అవయవాలు, క్రోమోజోమ్‌లు మామూలుగానే ఉన్నప్పటికీ, పొత్తికడుపు లోపల మాత్రం అభివృద్ధి చెందని గర్భాశయం ఉండిపోతుంది. ఏళ్ల తరబడి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు కాబట్టి, సాధారణంగా ఎంఆర్ఐ లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడే ఈ నిజం వెలుగులోకి వస్తుంది.
పరిస్థితిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేందుకు వైద్యులు లాప్రోస్కోపీ చేసి చూడగా, లోపల చిన్నదిగా ఉన్న గర్భాశయంతో పాటు, కడుపులోనే ఉండిపోయిన రెండు వృషణాలు కనిపించాయి. ఇవి చాలా కాలం పాటు కిందకి దిగకుండా కడుపులోనే ఉండిపోవడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలా శరీర ఉష్ణోగ్రత వద్ద కడుపులోనే ఉండిపోయిన వృషణాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో వైద్యుల బృందం వెంటనే లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించి, అతని పొత్తికడుపులోని గర్భాశయ భాగాలతో పాటు దెబ్బతిన్న వృషణాలను కూడా సురక్షితంగా తొలగించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!