NTV Telugu Site icon

Fraud: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి టోకరా

Fraud

Fraud

Fraud: ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నటించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 100 మందికి పైగా మోసం చేసినందుకు బెంగళూరులో 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడిని వికాస్ విహార్‌కు చెందిన కమల్ శర్మగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. “వి ఎలిమినేట్ పావర్టీ నౌ” అనే ఎన్‌జీఓను నడుపుతున్న కమల్ శర్మ చేతిలో మోసపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ మహిళ ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళకు తనను తాను ఫ్లైట్ లెఫ్టినెంట్ అని పరిచయం చేసుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం పేరుతో ఆమె నుంచి రూ. 12 లక్షలను దోచుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

విచారణలో వికాస్ శర్మ ఫిర్యాదుదారుతో వాట్సాప్ కాల్స్, చాట్‌ల ద్వారా మాత్రమే సంభాషించేవాడని తేలింది. తర్వాత బెంగళూరులోని ఓ హోటల్‌లో ఫ్లయింగ్ లెఫ్టినెంట్‌గా నకిలీ గుర్తింపు కార్డుతో అతడిని గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) రవికుమార్ సింగ్ తెలిపారు. అతనిపై ఇప్పటివరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో మూడు కేసులు నమోదయ్యాయని, ఆదర్శ్ మండి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో 11 నెలల పాటు జైలులోనే ఉన్నాడు. షామ్లీలోని కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసిందని పోలీసులు తెలిపారు.

Read Also: Gun Fire: ఆటలో ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని.. ఏడుగురిని చంపేశాడు!

ఛతర్‌పూర్‌లోని అతని అద్దె నివాసాలపై పోలీసులు దాడులు నిర్వహించి, ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం (నేమ్ ప్లేట్, ర్యాంక్‌లు, బ్యాడ్జ్‌లు, క్యాప్‌లు), ఎయిర్ పిస్టల్ గన్, వివిధ స్టాంపులు, ఐఏఎఫ్ లెటర్ హెడ్‌లు, కాల్ లెటర్‌లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. నిందితుడు ఐఏఎఫ్‌లో ఫ్లయింగ్ లెఫ్టినెంట్‌గా నటిస్తున్నాడు. అతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంతర్గత సమాచారాన్ని బాగా అర్థం చేసుకున్నాడ. వృత్తి పేరుతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.అతను 2016 నుండి ఒక NGOని కూడా నడుపుతున్నాడు. యువతను ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి యూపీ, హర్యానా, రాజస్థాన్‌లలో శిబిరాలు నిర్వహించాడు. అతను అభ్యర్థులను వివిధ నగరాలకు తీసుకెళ్లేవాడు. ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో ప్రజలను కలుసుకునేవాడు.