Site icon NTV Telugu

Delhi : కోర్టుకు చేరిన నమాజ్ ఇష్యూ.. మే 1లోగా యాక్షన్ నివేదిక ఇవ్వాలి

New Project (45)

New Project (45)

Delhi : ఢిల్లీలోని ఇంద్రలోక్‌లో నమాజ్‌ చేస్తుండగా తన్నిన ఘటన ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటనపై శనివారం విచారణ జరగ్గా, సంబంధిత డీసీపీ నుంచి కోర్టు నివేదిక కోరింది. తీస్ హజారీ కోర్టులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మనోజ్ కౌశల్ కేసు తదుపరి విచారణకు వచ్చే మే ​​1వ తేదీలోగా ‘యాక్షన్ టేకెన్’ నివేదికను సమర్పించాలని కోరారు.

ఈ ఘటన మార్చి 8న జరిగింది. ఢిల్లీలోని ఇంద్రలోక్‌లోని మక్కీ జామా మసీదు సమీపంలోని రహదారిపై ప్రజలు నమాజ్ చేశారు. ఈ సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేసేందుకు అక్కడికి వచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ తోమర్‌ కొందరు నమాజీలను తన్నాడు. వీడియోలో తోమర్ రోడ్డుపై ప్రార్థనలు చేస్తున్న వారిని తన్నడం, నెట్టడం, అతను ఉపయోగించిన ప్రార్థన చాపపై కూడా అడుగుపెట్టి కేకలు వేయడం కనిపించింది.

Read Also:GoodBadUgly : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అదుర్స్.. రికార్డ్ బ్రేక్ చేసిన పోస్టర్..

దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టడంతో పాటు మెట్రో స్టేషన్ దిగువన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం ఊపందుకోవడం ప్రారంభించింది. పెరుగుతున్న గందరగోళాన్ని చూసిన మనోజ్ తోమర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో చాలా మంది తోమర్‌కు మద్దతుగా నిలిచారు. రోడ్డుపై నమాజ్ చేయడం తప్పని.. అలా చేయడం వల్ల జనం జామ్‌ సృష్టిస్తారని అన్నారు.

కాగా, ఈ ఘటనపై న్యాయవాది ఫరాజ్ ఖాన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. నిందితులు, అతని బృందం సమాజంలో సామరస్యానికి.. శాంతికి విఘాతం కలిగించారని కూడా అతను వాదించాడు. ఫరాజ్ ఖాన్ తన ఫిర్యాదులో..’ఇటువంటి అసంబద్ధమైన చర్య ద్వారా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అతని బృందం సమాజంలో అనైక్యత సృష్టించడానికి బాధ్యత వహిస్తారు. నిందితులపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఆ ప్రాంత డీసీపీ నుంచి చర్యలు తీసుకున్న నివేదికను కోరారు.

Read Also: WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌.. కొత్త విజేత ఎవరో!

Exit mobile version