Site icon NTV Telugu

Delhi Water Crisis : రాజధానిలో నీటి ఎద్దడి.. కేంద్రానికి ఆప్ లేఖ

Atishi

Atishi

Delhi Water Crisis : ఓ వైపు ఎండ మరో వైపు తాగునీటి ఎద్దడి ఢిల్లీ ప్రజలను కలవరపెడుతోంది. నీటి కొరతపై ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అతిషి, సౌరభ్ భరద్వాజ్ 12 గంటలకు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సీనియర్ అధికారులందరూ హాజరయ్యారు. మరోవైపు ఢిల్లీ మంత్రి అతిషి వజీరాబాద్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా అతీషి మాట్లాడుతూ, ‘ఢిల్లీ మొత్తం నీటి సరఫరా కోసం యమునా నదిపై ఆధారపడి ఉంది. హర్యానా నుంచి విడుదలయ్యే నీరు మాత్రమే ఢిల్లీలోని యమునా నదిలోకి వస్తుంది. ఈ రోజు మనం వజీరాబాద్ ప్లాంట్ వద్ద ఉన్నాం. ఇక్కడ యమునా నీటి నుంచి వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు నీరు అందుతుంది. హర్యానా నుండి తక్కువ నీరు వచ్చినప్పుడు, నీటి శుద్ధి కర్మాగారం నీటిని ఎక్కడ నుండి తెస్తుంది? మేము హర్యానా ప్రభుత్వానికి లేఖ కూడా రాశాం. ఢిల్లీకి నీటి వాటాను పొందాలని మేం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తాం.’ అని పేర్కొన్నారు.

Read Also:MLA Pinnelli: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో పిటిషన్

హర్యానా నుంచి సకాలంలో నీటిని పూర్తి స్థాయిలో అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఢిల్లీ మంత్రి తెలిపారు. ఢిల్లీ యమునాపై ఆధారపడి ఉంది. వజీరాబాద్ వాటర్ ప్లాంట్ చేరుకున్నాం. ఇక్కడ నీరు నిరంతరం తగ్గుతోంది. వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా ఓటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు వెళుతుంది. కానీ నీరు తక్కువగా ఉండడంతో చేరడం లేదు.

హర్యానా ఢిల్లీకి నీరు ఇవ్వకపోతే ప్లాంట్లు ఎలా పనిచేస్తాయని ఆమె ప్రశ్నించారు. హర్యానాకు లేఖ కూడా రాశాం. అత్యవసర సమావేశానికి పిలిచామన్నారు మంత్రి. అధికారులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాం… నీటి సరఫరా సమస్య ఉంది. హర్యానా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఢిల్లీలో అత్యవసర పరిస్థితి నెలకొంది. హర్యానా ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. నీటి పైపులైన్‌ల లీకేజీ వల్ల ఢిల్లీలో నీరు వృథా అవుతుందనేది అపోహ. ఇది అస్సలు జరగడం లేదు. 30 శాతం వృధా అనేది అబద్ధం. ఈ సమయంలో ఎల్జీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేంద్రాన్ని లేఖ ద్వారా కోరారు.

Read Also:Dog Bite : ఎండలకు దూకుడు పెంచిన కుక్కలు.. ఒక్క నెలలో 16వేల మంది బాధితులు

Exit mobile version