NTV Telugu Site icon

Arvind Kejriwal: నేడు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల..

Keje

Keje

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. లక్ష రూపాయల పూచీకత్తుతో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, నేడు (శుక్రవారం) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అయితే, ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

Read Also: International Yoga Day : నేడు శ్రీనగర్ లోని అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోడీ

అయితే, అంతకుముందు, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలోని మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రౌస్‌ అవెన్యూ కోర్టు రిజర్వ్‌ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్‌ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ పాత్ర ఉందని తెలిపింది. అలాగే, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని.. ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని వెల్లడించింది. ఇక, వీటిని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొదని కోర్టును ఈడీ తరపు లాయార్ కోరారు. కేజ్రీవాల్ తరపు లాయర్ సైతం కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.. ఇందులో సాక్ష్యాలను ఇప్పటి వరకు తీసుకురాలేదని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.