NTV Telugu Site icon

Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం

Ekeke

Ekeke

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే పార్టీ శ్రేణులనుద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడతారని మంత్రి అతిషి తెలిపారు. జైలు నుంచి బయటకు  రాగానే కేజ్రీవాల్‌కు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, కుమర్తె, ఆప్ మంత్రులు, నాయకులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Refund Amount: భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. ఇక 6 గంటల్లోనే రీఫండ్..

ఇదిలా ఉంటే కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం తెలిపింది. బెయిల్ సమయంలో సీఎం కార్యాలయం లేదా సచివాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని సూచించింది.

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆరు విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 25న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి మనవి అంగీకరించి.. ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి రాగానే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయొచ్చని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కేజ్రీవాల్‌ను రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది.

ఇది కూడా చదవండి: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..