NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పెంపు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..!

Kejri

Kejri

Delhi Liquor Scam Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ వేసిన పిటీషన్ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ వేసి బెయిల్ పిటిషన్ పై చీఫ్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దత్తా స్పందిస్తూ.. అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మరి కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది.

Read Also: Stone Quarry: మిజోరంలో భారీ వర్షాలతో కూలిన గ్రానైట్‌ క్వారీ.. 10 మంది మృతి

అయితే, సీఎం కేజ్రీవాల్‌ తరపున కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైద్యుల సలహాతో పాటు నిర్బంధంలో ఉన్న సమయంలో అతను అకస్మాత్తుగా ఏడు కిలోల బరువు తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను పేర్కొన్నారు. PET-CT స్కాన్‌తో సహా అనేక వైద్య పరీక్షలు చేయవలసి ఉంటుంది.. దీనికి ఐదు-ఏడు రోజులు పట్టవచ్చు అని కేజ్రీవాల్ తన పిటిషన్ లో వెల్లడించారు.. వైద్య పరీక్షల దృష్ట్యా తన మధ్యంతర బెయిల్‌ను వారం రోజుల పాటు పొడిగించాలని.. జూన్ 2న కాకుండా జూన్ 9న లొంగిపోయేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కానీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.

Read Also: FSSAI: తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. ఎఫ్ఎఫ్ఎస్ఏఐ హెచ్చరిక..

కాగా, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ వేసిన ఆ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే, ఢిల్లీలో జరిగిన మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కొద్ది రోజుల క్రితం, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జూన్ 2వ తేదీన సీఎం లొంగిపోవాల్సి ఉంటుంది.