Site icon NTV Telugu

IPL 2025: ఢిల్లీకి ఆస్ట్రేలియా స్ట్రోక్.. తప్పుకున్న స్టార్ ఆటగాడు

Dc

Dc

IPL 2025: ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ సీజన్లో తేలిపోయింది. వరుస మ్యాచుల్లో ఓడి టేబుల్ టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.అయినా ఢిల్లీ ప్లేఆప్స్ అవకాశాలు కోల్పోదు. 11 మ్యాచుల్లో 6 గెలిచి 13 పాయింట్లతో ప్లేఆప్స్ ఆశలను సజీవం చేసుకుంది. సరిగా ప్లేఅఫ్స కి ముందు ఢిల్లీకి షాకిస్తూ ఆస్ట్రేలియన్ ప్లేయర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.ఆ జట్టు స్టార్ ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఐపీఎల్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.ఇది ఢిల్లీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. అంతకుముందు భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య బీసీసీఐ ఐపీఎల్ ని వాయిదా వేసింది.దీంతో విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐకి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరు షాకిస్తున్నారు. తిరిగి భారత్ కు వచ్చేందుకు వెనకాడుతున్నారు.

Kadapa Mayor: కడప మేయర్‌పై అనర్హత వేటు.. అసలు కారణం ఇదేనా..?

ఈ క్రమంలో మెక్‌గుర్క్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వెంటనే మరో ఆటగాడిని రీప్లేస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మెక్‌గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ యువ బ్యాట్స్‌మన్ మొత్తం 6 మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 38 మాత్రమే.

CM Revanth Reddy : కాళేశ్వర త్రివేణి సంగమంలో రేపు సీఎం రేవంత్‌ రెడ్డి పుణ్యస్నానం

Exit mobile version