పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో సిద్ధమై.. టేకాఫ్ అవుతుండగా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమాన మధ్య భాగం భారీగా దెబ్బతింది. పైలట్ల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు, ల్యాండింగ్ గేర్ దగ్గర టైర్ దెబ్బతిన్నట్లు విమానాశ్రయ అధికారి వెల్లడించారు.
పూణె నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 180 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం రెడీ అయింది. టేకాఫ్ అవుతుండగా టగ్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో విమాన భాగంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను కిందకి దించేశామని.. ప్రత్యామ్నాయంగా మరో విమానంలో ప్యాసింజర్స్‌ను పంపించినట్లు అధికారులు తెలిపారు.
ఇక ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ ప్రారంభించింది. ప్రమాదం తర్వాత ఎయిర్‌పోర్టులో అన్ని కార్యకలాపాలు అంతరాయం లేకుండా సాగుతున్నాయని తెలిపింది. ప్రమాదం తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ విమాన సర్వీసును రద్దు చేసింది. కొందరికి ఛార్జీలను తిరిగి చెల్లించగా.. మరికొందరిని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పటుచేసింది. దర్యాప్తు జరుగుతుందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
