NTV Telugu Site icon

Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

Delhi

Delhi

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్‌ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్‌ తీవ్రమైన కేటగిరీలో ఉన్నట్లు తేలింది.

Read Also: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ

అయితే, గాలి నాణ్యత సూచీ ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి, ముండ్కా, నెహ్రూ నగర్, షాదీపూర్, సోనియా విహార్, వివేక్ విహార్, వజీర్‌పూర్‌లో చాలా అధ్వానంగా ఉందని వెల్లడించింది. ఈ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్‌ 400 కంటే ఎక్కువే నమోదనట్లు అధికారులు తెలిపారు. తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఉదయం 8:30 గంటలకు ఢిల్లీలో తేమ స్థాయిలు 97 శాతంగా ఉండగా.. రోజంతా మోస్తరు పొగమంచు కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక, గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు.

Show comments