NTV Telugu Site icon

Delhi Air Pollution: ఢిల్లీలో కనిపించని రోడ్లు.. నానా అవస్థలు పడుతున్న జనం

Delhi

Delhi

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో జన జీవనం కష్టతరంగా మారిపోతుంది. ఢిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిని తగ్గించలేకపోతుంది. అయితే, ఇవాళ ఢిల్లీలో గాలి కాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ కలుషిత గాలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Read Also: Telangana Elections 2023: టెలీ ప్రచారంలో అభ్యర్థుల పోటాపోటీ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు కాల్స్‌

ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. నేడు ఢిల్లీలోని బవానాలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AQI) 442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్, ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదు అయినట్లు తెలిపింది. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదురుగా వస్తున్నవి క్లీయర్ గా కనిపించకపోవడంతో నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. దీంతో విజిబులిటీ మరింతగా క్షీణించింది అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని వారు పేర్కొన్నారు.