NTV Telugu Site icon

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది..

Delhi Air

Delhi Air

ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గాలి తీవ్రత పెరిగిపోతుండటంతో దేశ రాజధానిలోని 14 ప్రాంతాలలో ఏక్యూఐ (AQI) 400 కంటే ఎక్కువగా నమోదు అవుతుంది. మరో రెండు మూడు రోజుల వరకు ఈ కాలుష్యం కొనసాగుతుందని సమాచారం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఏక్యూఐ నిన్న (గురువారం) 390గా ఉండగా.. ఇవాళ ఉదయం ఈ సంఖ్య 450కి చేరుకుంది. ఈ స్థాయిలో గాలి న్యాణత పడిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Read Also: Viral video : వార్నీ.. ఏంట్రా ఇది.. కొత్తిమీరతో బజ్జీలా.. దండంరా బాబు..

నేడు మళ్లీ బవానా ఢిల్లీలో అత్యంత కలుషితమైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ ఏక్యూఐ 450 ఉండగా, జహంగీర్‌పురి ఏక్యూఐ 439 పాయింట్లు నమోదు కావడంతో రెండవ స్థానంలో నిలిచింది. గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 100 కంటే తక్కువగా ఉండాలి.. పీఎం 2.5 యొక్క సగటు స్థాయి 60 కంటే తక్కువగా ఉండాలి.. అప్పుడే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని గాలిలో పీఎం 10 యొక్క సగటు స్థాయి 355, పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 206 మైక్రోగ్రాములు.. గాలిలో కాలుష్య కణాల స్థాయి ప్రమాణాల కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా పెరిగింది.

Read Also: Aadikeshava Twitter Review : ‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ.. ఊరమాస్ యాక్షన్.. క్లైమాక్స్ ఫీక్స్..

అయితే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. వచ్చే మూడు-నాలుగు రోజులలో గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలో మీటర్ల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల కాలుష్య కారకాలు వెదజల్లడం లేదు.. రేపు ఏక్యూఐ తీవ్రమైన కేటగిరీకి చేరుకోనుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో దాదాపు 800 కేసులు నమోదయ్యాయి. పుణెలోని ఐఐటీఎం (IITM) డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాయు కాలుష్యం ఇవాళ నాలుగు శాతం రేపు మూడు శాతం తగ్గే అవకాశం ఉండొచ్చు.

ఈ ప్రాంతాల్లో ఏక్యూఐ నాలుగు వందలు దాటింది
జహంగీర్‌పురి – 426
ఆనంద్ విహార్ – 407
అశోక్ విహార్- 420
బవానా- 450
ద్వారక- 400
జహంగీర్‌పురి- 439
ఆర్కే పురం- 422
వజీర్‌పూర్- 443
వివేక్ బీహార్- 435