Sudarshan Chakra: భారతదేశానికి పెట్టని కోటలా హిమాలయాలు ఉన్నట్లే, ఇకపై ఢిల్లీకి సుదర్శన చక్ర మారబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ భద్రత ఇప్పుడు చాలా అభేద్యంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో ఏ శత్రు దేశ డ్రోన్, క్షిపణి లేదా విమానం కూడా ఢిల్లీ గగన తలంలోకి ప్రవేశించే ఆలోచన చేయలేదు. ఢిల్లీలోని అత్యంత సున్నితమైన VIP ప్రాంతాల రక్షణకు రూ.5,181 కోట్ల విలువైన స్వదేశీ ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్’ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. దీనిని ‘సుదర్శన్ చక్ర’లో భాగంగా మోహరించనున్నారు. ఇది దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తుంది.
READ ALSO: Mohanlal Mother Dead: మోహన్‌లాల్‌కి మాతృవియోగం!
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది పూర్తిగా స్వదేశీ సాంకేతికతో తయారు అయ్యిందే. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ.. ఇప్పుడు ఢిల్లీ-NCR లోని ‘VIP-89 జోన్’ మీదుగా 30 కిలోమీటర్ల పరిధిలో బహుళ-పొరల రక్షణను అందిస్తుంది. వాస్తవానికి నేడు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో కూడిన బెదిరింపులు పెరిగాయి. ఇకపై ఢిల్లీకి గస్తీగా ఏర్పాటు చేయనున్న ఈ కొత్త వ్యవస్థ తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను త్వరగా గుర్తించి, వాటిని గాలిలో నాశనం చేయగలదు. ఇది నెట్‌వర్క్ ఆధారిత వ్యవస్థ. రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
READ ALSO: Nagarjuna: ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన మన్మధుడు..
