Suicide : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భవాని నగర్ లో దారుణం చోటు చేసుకుంది.ఒమేగా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణిమ అనే విద్యార్థిని నిన్న రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల నుండి వచ్చిన తర్వాత పూర్ణిమ ను నిఖిల్ అనే వ్యక్తి నుండి ప్రేమ పేరుతో వేధింపులు శృతి మించడంతో మనస్తాపానికి గురై యాసిడ్ తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రేమ పేరుతో నిఖిల్ అనే వ్యక్తి పూర్ణిమను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు పూర్ణిమ తరుపు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి బాధిత కుటుంబ సభ్యులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఇప్పటివరకు నిఖిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, వెంటనే యువతీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
Sudden Death: భర్త రిటైర్మెంట్ పార్టీలో భార్య సడన్ డెత్.. వీడియో వైరల్