NTV Telugu Site icon

Deepti Sharma: దీప్తి శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత స్పిన్నర్‌గా!

55

55

టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తిశర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అటు పురుషులు, ఇటు మహిళా ఆటగాళ్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 3 వికెట్లు పడగొట్టిన దీప్తిశర్మ ఈ ఘనతను అందుకుంది. మొత్తం 89 మ్యాచుల్లో దీప్తి ఈ మార్కును చేరుకుంది. తర్వాత స్థానంలో సహచర బౌలర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచుల్లో 98 వికెట్లతో ఉంది. ఇక మెన్స్ క్రికెట్‌లో యుజ్వేంద్ర చహల్ 75 మ్యాచుల్లో 91 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో 90 వికెట్లతో ఈ మైలురాయికి చేరువలో ఉన్నారు.

Also Read: Shahid Afridi: బీసీసీఐని కాదని ఐసీసీ ఏం చేయలేదు: షాహిద్ అఫ్రిదీ

ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దీప్తిశర్మ 9వ స్థానంలో నిలిచింది. దీప్తి కంటే ముందు వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ (125 వికెట్లు), పాకిస్తాన్ బౌలర్ నిదా దర్ (121), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ (120) ఉన్నారు. మెన్స్ క్రికెట్‌లో టిమ్ సౌథీ (134), షకీబుల్ హసన్ (128), రషీద్ ఖాన్ (122), ఇష్ సోదీ (114), లసిత్ మలింగ (107) వంద వికెట్ల క్లబ్‌లో ఇప్పటికే చేరారు.

Also Read: Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్