Site icon NTV Telugu

Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?

Deepika Padukune

Deepika Padukune

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న దీపికా పదుకొనె, వరుసగా భారీ ఆఫర్లను కోల్పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ (Spirit), ‘కల్కి 2’ (Kalki 2) నుంచి ఆమె తప్పుకోగా, తాజాగా ఒక ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది వైట్ లోటస్’ (The White Lotus) సిరీస్ 4వ సీజన్ కోసం మేకర్స్ దీపికాను సంప్రదించారట. అయితే,

Also Read : JrNTR-Neel : ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్‌డేట్..

ఈ సిరీస్‌లో నటించాలంటే ఆడిషన్ ఇవ్వడం తప్పనిసరి అని మేకర్స్ స్పష్టం చేశారు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తాను ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడం ఏంటని దీపికా భావించినట్లు టాక్. తాను ఆడిషన్‌కు రాలేనని ఆమె తేల్చి చెప్పడంతో, మేకర్స్ మరో నటిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. గతంలో ‘XXX: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’తో హాలీవుడ్‌లో మెరిసిన దీపికాకు, ఇది మంచి కమ్‌బ్యాక్ అయ్యేదే కానీ ‘ఈగో’ కారణంగానే ఈ ఛాన్స్ మిస్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, టాలీవుడ్‌లోనూ దీపికా వ్యవహారశైలిపై చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే ‘స్పిరిట్’ చిత్రంలో పని గంటలు, రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన విభేదాల వల్లే ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని సమాచారం. ‘కల్కి 2’ విషయంలో కూడా ఇలాంటి కారణాలే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దీపికా టీమ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఒక భారీ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version