బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కల్కి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సినిమాలో దీపికా పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కల్కి టీమ్ ముంబై లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి.. కల్కి 2898ఏడీ` సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్. భైరవ థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు. దీంతోపాటు `కల్కి కథ ఎలా పుట్టిందో వివరించాడు అశ్విన్.. ముంబైలో ప్రమోషన్ లో భాగంగా భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. రానా హోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు..
ఈ ఈవెంట్ కు దీపికా పదుకొనే బేబీ బంప్స్ తో వచ్చింది.. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తలెసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె బేబీ బంప్ కనిపించేలా వచ్చింది. బ్లాక్ టైట్ ఫిట్ ధరించింది.. ఆ డ్రెస్సులో దీపికా బేబీ బంప్స్ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనెతోపాటు ప్రభాస్ పాల్గొని ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నారు. ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చినట్టు తెలిపారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు.. ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదల కాబోతుంది..