Vikarabad : వికారాబాద్ జిల్లా.. చిలాపూర్‌లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థి ఏడేళ్ల బాలుడు కార్తీక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆ పిల్లాణ్ని టీచర్ కొట్టడంతో… కింద పడిపోయాడనీ… వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా… చనిపోయినట్లు తెలిసింది. స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆ తల్లిదండ్రులు.. చనుమోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Also: 300 Stones In Kidney : ఏం తాత కిడ్నీలో ఇన్ని రాళ్లు పోగేశావా..?
కాగా.. స్కూల్ యాజమాన్యం మాత్రం మరోలా చెబుతోంది. బాలుడు బెడ్ మీద నుంచి పడటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని… అక్కడే బాలుడు మృతి చెందాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Jagga Reddy : సీఎం కేసీఆర్కు లేఖ రాసిన జగ్గారెడ్డి.. పార్టీ మారుతారంటూ ప్రచారం
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఎన్ టివి తో బాలుడు తండ్రి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ బెడ్ మీద నుంచి పడ్డాను అని బాబు తమతో చెప్పినట్లు నవీన్ చెప్పాడు. బాబుకు జ్వరం వచ్చిందని సోమవారం స్కూల్ మేనేజ్ మెంట్ కాల్ చేయడంతో బాబును తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్చామన్నారు. వారు ఎక్స్ రే తీయగా కుడి చేయి విరిగింది. జ్వరం తగ్గిందనీ, ఇంటికి వచ్చాం.. కానీ నిన్న బాబు ఊపిరి పీల్చుకోనేందుకు ఇబ్బంది పడినట్లు బాలుడి తండ్రి నవీన్ తెలిపాడు. అంతే కాకుండా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు హాస్పిటల్ రిపోర్ట్ లో వచ్చిందన్నారు. 20 రోజుల ముందే బాబును కొట్టినట్లు తెలుస్తోందన్నారు. స్కూల్ మేనేజ్ మెంట్ వార్డెన్ కు అవగాహన లేదు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని నవీన్ వాపోయారు.