Site icon NTV Telugu

Tirupati: కారులో డెడ్ బాడీల కలకలం..

Car

Car

తిరుపతిలో ఓ కారులో డెడ్ బాడీలు కలకలం రేపాయి. తిరుచానూరు రంగనాధం వీధీలో ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలిసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో బీర్లు తాగి మత్తులో అలానే ‌నిద్రించడంతో ఊపిరి ఆడక మృతి చెందారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకుల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వినయ్, దీలీప్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను కారు నుంచి బయట తీశారు పోలీసులు. ఎస్సై సాయి నాధ్ చౌదరీ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Exit mobile version