NTV Telugu Site icon

David Warner: ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటకు.. వేదికపై డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్(వీడియో)

David Warner

David Warner

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ స్పెషల్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి టీమ్‌తో కలిసి వార్నర్ హాజరయ్యాడు. అంతే కాదు.. ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ‘అదిదా సర్‌ప్రైజ్’ అనే పాటకు డేవిడ్ వార్నర్ స్టెప్పులేశాడు. హీరో నితిన్‌తో పాటు పలువురు యాక్టర్‌లతో కలిసి స్టేజీపై డ్యాన్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!

గతంలో ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్‌.. క్రమంగా తెలుగు సినిమాలపై, ప్రజలపై మక్కువ పెంచుకున్నారు. తరచుగా టాలీవుడ్ స్టార్ హీరోలపై రీల్స్ కూడా చేస్తుంటాడు. తెలుగు సినిమా డైలాగ్స్‌, పాటలకు సరదా వీడియోలు చేసి ఆకట్టుకుంటుంటాడు. అందుకే అతడికి తెలుగు ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ క్రమంలోనే నితిన్ రాబిన్‌హుడ్‌ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో డేవిడ్‌ అనే పాత్రలో వార్నర్‌ యాక్ట్ చేశాడు.

READ MORE: Bangladesh: ఇబ్బందుల్లో మహ్మద్ యూనస్.. ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితి..?