హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ స్కూల్లో ముక్కుపచ్చలారని చిన్నారిపై జరిగిన లైంగిక దాడి అందరినీ కలిచి వేసింది. డీఏవీ స్కూల్ అత్యాచార ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. పాఠశాల గుర్తింపుని రద్దుచేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ వేధింపులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె ఆదేశించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
Read Also: MosChip: హైదరాబాద్ టెక్ కంపెనీ ‘మాస్ చిప్’ ప్రత్యేకతేంటి?
మరోవైపు డీఏవీ స్కూల్ కు చెందిన సుమారు 200మంది విద్యార్ధినీ, విద్యార్ధుల తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు. స్కూల్ ని తెరవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా వుంటే..పాఠశాల విద్యా కమిషనర్ తో DAV పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్ భేటీ ముగిసింది. కమిషనర్ కు అన్ని విషయాలు తెలియజేశామన్నారు డీఏవీ స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు. స్కూల్ రిఓపెన్ వారం రోజుల్లో అవుతుంది అని భరోసా ఇచ్చారు. కమిషనర్ దేవసేన సానుకూలంగా స్పందించారన్నారు. ఢిల్లీ నుండి DAV స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఇద్దరు సభ్యులు రాగా, సఫిల్ గూడ నుంచి ముగ్గురు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు.
స్కూల్ మేనేజర్ శేషాద్రి మాట్లాడుతూ…కమిషనర్ దేవసేన ను DAV స్కూల్ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. ఘటన పై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్ తో కలిపి మా వినతిని కూడా అందించాం. పాఠశాల గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్ లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం అన్నారు.
Read Also: Unstoppable 2: బాలయ్య షో కు రోజా.. దబిడి దిబిడే..?
కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చామన్నారు. DAV స్కూల్ పేరెంట్స్ , యాజమాన్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చర్చలు సఫలం అయ్యాయి. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు కమిషనర్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కమిషనర్. ఇవ్వాళ రేపట్లో యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా రిపోర్ట్ వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపుతామని కమిషనర్ దేవసేన తెలిపారు. స్కూల్ రీ ఓపెన్ కి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
