NTV Telugu Site icon

SDT 18 : శరవేగంగా ఎస్ డీటీ18 షూటింగ్.. టైటిల్, గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్

New Project (13)

New Project (13)

SDT 18 : విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరగడం విశేషం. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరో సాయి దుర్గ తేజ్‌ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను గతంలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read Also:Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు

పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా ఎస్‌డీటీ 18 రూపొందుతోంది. ఈ సినిమా సాయి తేజ్ కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్, మేకింగ్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. మేకర్స్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు వారు డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పవర్‌ఫుల్ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. సాయి దుర్గ తేజ్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని పోస్టర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Read Also:Girl Friend : రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్