Hero Nani: ఈ పదేళ్లలో నాకు ఇష్టమైన సినిమా అదే: హీరో నాని
- డార్లింగ్ ప్రీరిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా హీరో నాని
- స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Nani about Priyadarshi in Darling Pre Release Event: ఈ పదేళ్ల కాలంలోనే తనకు ఇష్టమైన సినిమా బలగం అని హీరో నాని తెలిపారు. డార్లింగ్ సినిమా కూడా బలగం అంత ప్రత్యేకం కావాలని కోరుకున్నారు. ప్రియదర్శిపై తనకు చాలా నమ్మకం ఉందని, తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా అని నాని చెప్పారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్ ప్రీరిలీజ్ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రీరిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ… ‘అందరికీ నమస్కారం. వచ్చే నెల సరిపోదా శనివారం ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్రియదర్శి వలన కొంచెం ముందుగానే స్టార్ట్ అయినాయి. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. డార్లింగ్ టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉన్నాయి. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి.. కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. గతేడాది లవ్ స్టొరీ, ఎమోషన్ కలిపి హాయ్ నాన్నతో వచ్చాను. ఈ ఏడాది లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ వస్తోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. కామెడీ ఎమోషన్ లవ్ యాక్షన్.. ఇలా అన్నీ జోనర్ సినిమాలు రావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది. లేడి అపరిచితుడు లాంటి కాన్సెప్ట్ సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో వూహించగలను. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది’ అని అన్నారు.
Also Read
Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మరోసారి 74 వేల మార్క్‌ను దాటింది !
‘నిరంజన్ గారు, చైతన్య గారి హను-మాన్ అంత సక్సెస్ డార్లింగ్ కావాలని కోరుకుంటున్నా. వివేక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. తనకి ఓ కల్ట్ ఫాలోయింగ్ వుంది.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు. డైరెక్టర్ అశ్విన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నభా డార్లింగ్‌తో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ నాన్న చిత్రం గోవా షూటింగ్ సమయంలో ఓ రోజు సరదాగా బయటికి వెళ్లాం. కబుర్లు చెప్పుకున్నాం. తను చేసే నటన, పాత్రలు నాకు ఇష్టం. ఈ పదేళ్లలో నాకు బాగా నచ్చిన సినిమా బలగం. నేను బలగం హీరో ఫ్యాన్‌గా ఈ వేడుకకి వచ్చాను. డార్లింగ్ కూడా దర్శి కెరీర్లో ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నా. జూలై 19న సినిమా రిలీజ్ అవుతుంది. నేను ఖచ్చితంగా చూస్తాను. ఈ శుభ సందర్భంలో మీతో ఒక విషయం చెప్పాలి. నా వాల్ పోస్టర్ బ్యానర్ తదుపరి సినిమాలో దర్శినే హీరో. జగదీశ్ ఈ మూవీకి డైరెక్టర్. మిగతా వివరాలు త్వరలో చెప్తాం. డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని నాని చెప్పారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..