NTV Telugu Site icon

Darling : సోషల్ మీడియాలో ‘డార్లింగ్’ రచ్చ.. అంతా ఆ సినిమా కోసమేనా..?

Whatsapp Image 2024 04 19 At 12.30.46 Pm

Whatsapp Image 2024 04 19 At 12.30.46 Pm

టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు.మల్లేశం సినిమా ప్రియదర్శికి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ తరువాత బలగం సినిమాతో ఈ యంగ్ హీరో తన కెరీర్ లోనే భారీ హిట్ ను అందుకున్నాడు..దీనితో ప్రియదర్శి హీరోగా బాగానే రానిస్తున్నాడు. తాజాగా ప్రియదర్శి నటించిన ఓం భీమ్ బుష్ సినిమా కూడా మంచి హిట్ కావడంతో ప్రస్తుతం ప్రియదర్శికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. .ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా ప్రియదర్శి హీరోయిన్ నభా నటేష్ తో  గొడవ పడడం ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. ఆమె పెట్టిన ఫోటోకు ప్రియదర్శి డార్లింగ్ అంటూ కామెంట్ చేయడంతో ఆమె సీరియస్ అయింది. లీగల్ గా అమ్మాయిలను డార్లింగ్ అంటే జైలుకు వెళ్లాల్సిందే అని కోర్టు తీర్పుకు సంబందించిన వార్తను కూడా ఆమె షేర్ చేస్తూ మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.

ఇక ప్రియదర్శి మాత్రం ఎందుకు మేడం అంత కోపం అంటూ నభాను కూల్ చేసే ప్రయత్నం చేసాడు ..ఇంతటితో ఆగకుండా ఈ గొడవలోకి మరో హీరోయిన్ ను కూడా లాగారు .హీరోయిన్ రీతూ వర్మను కూడా ప్రియదర్శి డార్లింగ్ అని కామెంట్ చేయడంతో నభా మరింత రెచ్చిపోయింది .వీరిద్దరి గొడవలో రీతూ దూరి మరింత రచ్చ చేసింది..దీనితో ఈ రచ్చకు కారణం ఏంటా అని చూస్తే సినిమా ప్రమోషన్ అని అసలు విషయం బయటపడింది..ప్రియదర్శి హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ నటిస్తుంది..హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ..రేపు ఉదయం 11. 07 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు .ఈ సినిమాకు “డార్లింగ్” అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు.దర్శకుడు ఇంద్రగంటి తన స్టైల్ లవ్ స్టోరీతో మెప్పిచేందుకు సిద్ధం అయ్యాడు.”డార్లింగ్”  సినిమా అనౌన్స్మెంట్ కు ముందే సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా హీరో హీరోయిన్లు ఫన్నీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు. ఇప్పుడు ఈ సినిమా గురించి అందరికి తెలిసిపోయింది.

Show comments