Site icon NTV Telugu

Vijayawada: రెచ్చిపోతున్న దొంగలు.. ఏకంగా ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎక్కించి జంప్..

Tractor

Tractor

విజయవాడలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎక్కించి ఎత్తుకెళ్లారు. విజయవాడ భవానీపురం చర్చి సెంటర్ నాయరా పెట్రోల్ బంక్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్లను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ద్వారా కంటైనర్‌ను గుర్తించారు. ఈనెల 8వ తారీకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రాత్రి సుమారు 9 గంటల సమయంలో భవానిపురం చర్చి సెంటర్ దగ్గర ట్రాక్టర్ పార్క్ చేశాడు. ఉదయం నాలుగున్నర గంటలకి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో జులై 9 వ తారీకు ఉదయం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

READ MORE: Bitchat: వాట్సాప్ లాంటి యాప్.. కానీ ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేయొచ్చు.. ఆ పరిస్థితుల్లో ఇదొక వరం

నిందితుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్ట్ టాగ్ వాడటంతో టోల్గేట్‌లో ఆధారంగా 24 గంటల్లో సత్య సాయి జిల్లా, అమ్మవారిపాలెం దగ్గర కంటైనర్‌ని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ కు చెందిన రాజీవ్ సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి ట్రాక్టర్ ను అందజేశారు. నిందితుడు రాజీవ్ సింగ్ అనంతపురం కియా కార్ షోరూమ్ లో కార్లు డెలివరీకి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు. రాత్రి సమయంలో ఎవరు లేని టైంలో కంటైనర్ లో ట్రాక్టర్ ఎక్కించుకొని ఎత్తుకెళ్లాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో నిందితుడు పేర్కొన్నాడు.

READ MORE: Execution: నిమిషాప్రియా మాత్రమే కాదు, మరో దేశంలో ముగ్గురు భారతీయులకు ఉరిశిక్ష..

Exit mobile version