NTV Telugu Site icon

Bigg Boss Nainika : ఆయన చెప్పాడని జానీ మాస్టర్ దగ్గరకు నా బిడ్డను పంపలేదు.. బిగ్ బాస్ నైనిక తల్లి

New Project (76)

New Project (76)

Bigg Boss Nainika : దేశంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ భారీ టీఆర్పీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటి వరకు అయిదు వారాలు పూర్తి అయింది. ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో నైనిక ఎలిమినేట్ అయింది. ఢీ షోలో డ్యాన్సర్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నైనిక ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే నటిగానూ రాణిస్తోంది.

Read Also:Lalu Prasad Yadav: ఢిల్లీ కోర్టులో లాలు ప్రసాద్, తేజస్వీయాదవ్‌లకు బిగ్ రిలీఫ్..

ఐదు వారాలు కూడా నైనిక తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అందరినీ అలరించింది. ఇక నైనిక బిగ్ బాస్ లో మరింత ముందుకెళ్లాలని ఆమె తల్లి బయట ప్రమోషన్లు కూడా బాగానే చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నైనిక తల్లి మాట్లాడుతూ.. నైనిక బిగ్ బాస్ కి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంది. సడెన్ గా అవకాశం వచ్చే సరికి మొదట నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. నైనికకు గణేష్ మాస్టర్ వద్ద, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు వచ్చాయి. కానీ జానీ మాస్టర్ దగ్గరికి వద్దని శశి మాస్టర్ చెప్పడంతో ఆగిపోయాం. తను నటిగా కూడా మారాలని అనుకోవడంతో దాని వైపు కూడా ప్రస్తుతం ఫోకస్ చేస్తుంది. అప్పుడప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వెళ్లి వర్క్ చేస్తుందని తెలిపింది.

Read Also:JR.NTR : ఏపీ – తెలంగాణ దేవర 10 రోజుల కలెక్షన్స్.. మాస్ దంచుడు

మరి ఇప్పుడు బిగ్ బాస హౌసునుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత నైనిక కొరియోగ్రాఫర్ గా మారుతుందా, హీరోయిన్ అవుతుందో చూడాలి. అయితే జానీ మాస్టర్ వివాదం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంటే.. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గర ఆఫర్ వచ్చినా వేరే డ్యాన్స్ మాస్టర్ వెళ్లొద్దని చెప్పడంతో కామెంట్స్ వైరల్ గా మారాయి.