Damodar Raja Narasimha: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం ఇటీవల పక్కన పెట్టింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై మరిన్ని మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.
Read also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!
అయితే దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచిందని తెలిపారు. మా ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని తెలిపారు. ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారని తెలిపారు. మరోవైపు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కల నెరవేరిందని అన్నారు. ఇది అందరి విజయం సాధించారు. సీఎం రేవంత్ కృషి ఉందన్నారు. ప్రత్యేకంగా సుప్రి కోర్టుకు మంత్రిని పంపి.. ప్రత్యేక అడ్వకేట్ నీ నియమించారన్నారు. చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది అందరి విజయం అన్నారు.
Supreme Court: ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సంచలన తీర్పు