Site icon NTV Telugu

Damodar Raja Narasimha: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha

Damodar Raja Narasimha: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలకపాత్ర పోషిస్తారన్నారు.

Mallu Bhatti Vikramarka: అమెరికాలోని లాస్‭వేగాస్‌ మైన్ ఎక్స్‭పోలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క..

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న కొత్త రోగాలకు తగ్గట్టుగా నూతన వర్షన్లను దృష్టిలో పెట్టుకొని కొత్త ఔషధాలు తయారు చేయడం, నివారణ మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్టల పాత్ర కీలకమైనదన్నారు. రక్త దానంతో పాటు అవయవ దానం పట్ల కూడా అవగాహనను కల్పించేలా ఫార్మసీ కళాశాలలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఫార్మసీ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు కూడా పాల్గొన్నారు.

BRS Working President: పబ్లిసిటీ స్టంట్తో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడప లేరు..

Exit mobile version