NTV Telugu Site icon

West Bengal: బెంగాల్లో దెబ్బతిన్న పాఠశాలలు.. కారణమదే!

Bengal

Bengal

పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన పాఠశాల భవనాలల్లోనే నిర్వహిస్తారు. ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పద్ధతి కొనసాగుతుంది. అయితే బెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ అనేక పాఠశాలలు ఘోరమైన నష్టాన్ని చవిచూశాయి. కొన్ని పాఠశాలల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. మరికొన్ని తరగతి గదుల టేబుల్‌లు, కుర్చీలు విరిగిపోయాయి. అక్కడ జరిగిన హింస సమయంలో.. దుండగులు పాఠశాల కుర్చీలు, టేబుల్స్, వాటర్ ఫిల్టర్లు, ఇనుప గేట్లు మరియు బాత్రూమ్ కుళాయిలను నాశనం చేశారు.

Vaishnavi Chaitanya: ప్రాణం పెట్టి చేశా.. కొంచెం మీటర్ తప్పినా ఇక అంతే!

ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండలో పలు పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల వాష్‌ బేసిన్లు మాయమై ప్రస్తుతం ఆ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అయితే ఓటు వేయడం వల్ల పిల్లల చదువులు దెబ్బతినకుండా, ఓటింగ్ వల్ల పాఠశాలకు నష్టం వాటిల్లితే వెంటనే పరిహారం అందజేయాలని ఎన్నికల సంఘం నిబంధన ఉంది. నష్టాన్ని వీలైనంత త్వరగా నివేదించాలని జిల్లాలను కమిషన్ ఆదేశించింది. దీంతో విద్యాశాఖ.. జిల్లాలకు జరిగిన నష్టాల తొలి జాబితాను రాష్ట్ర సచివాలయంకు పంపింది. ఓటింగ్ కారణంగా ఏ జిల్లాలు ఎక్కువగా నష్టపోయాయో అందులో ఉంటుంది.

PM Modi: బుర్జ్ ఖలీఫాపై భారత ప్రధాని మోడీ ఫోటో

పంచాయతీ ఎన్నికల్లో ముర్షిదాబాద్ జిల్లాలో అత్యంత ఉత్కంఠ నెలకొంది. అక్కడే ఎక్కువగా హింస జరిగింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక వ్యతిరేకతను ఎదుర్కొంది. విద్యాశాఖ లేఖలో కూడా ముర్షిదాబాద్ జిల్లాలోని పాఠశాలలు ఎక్కువగా నష్టపోయాయని తేలింది. ముర్షిదాబాద్‌లో 135 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. రఘునాథ్‌గంజ్‌లోని మిథిపూర్ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఓటు వేసిన తర్వాత 4 కుర్చీలు, 4 బల్బులు, 1 ఫ్యాన్, 1 ట్యూబ్‌లైట్ కనిపించలేదు. నూడాలోని మలిత్య పద పాఠశాలలో 3 కిటికీలు, 2 టేబుళ్లు, వంట గ్యాస్ సిలిండర్, బల్బు, ఎలక్ట్రిక్ బోర్డు, బాత్‌రూమ్ పాన్, కిటికీలు, మగ్ మాయమయ్యాయి. లాల్‌గొల జగన్నాథపూర్‌ హైస్కూల్‌లో రెండు తలుపులు, నాలుగు కిటికీలు, మూడు టేబుళ్లు, ఏడు బెంచీలు నాశనమయ్యాయి.

Monsoon Disease: వర్షాకాలంలో ఈ అలవాట్లను పాటిస్తే.. వ్యాధులు దరిచేరవు..!

ముర్షిదాబాద్ తర్వాత ఉత్తర దినాజ్‌పూర్‌లో పాఠశాలల్లో అత్యధిక విధ్వంసం ఘటనలు జరిగాయి. అక్కడ 28 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. మాల్దాలో 20, కూచ్ బెహార్‌లో 10, హౌరాలో కొన్ని పాఠశాలలు ధ్వంసమయ్యాయి.
ప్రాథమికంగా రూ.36 లక్షల 57 వేల నష్టం వాటిల్లిందని పాఠశాల విద్యాశాఖ నాబన్నకు తెలిపింది. త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సచివాలయం (నాబన్న)కు విన్నవించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండలో 50 మందికి పైగా మరణించారని.. ఎన్నికల ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారు.