NTV Telugu Site icon

Daggubati Purandeswari : ప్రజా కంటక ప్రభుత్వంలో దారుణాలు జరిగాయి

Purandeshwari

Purandeshwari

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైతు బజార్‌లో బియ్యం, కందిపప్పు సరసమైన ధరలకు విక్రయిస్తున్నా కౌంటర్‌ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నిన్న మొన్నటి వరకు ప్రజలపై ఏ విధంగా భారం పడిందో చూసామన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పదవి చేపట్టిన నాటి నుండి తనిఖీలు చేపట్టిన తర్వాత అవినీతి బయటపడిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజా కంటక ప్రభుత్వంలో దారుణాలు జరిగాయని ఆమె విమర్శించారు. ఇప్పుడు ప్రజా రంజికపాలన అధికారంలోకి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపేట అని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఎన్నో భాగంగానే బియ్యం కందిపప్పులను తక్కువ ధరలకు విక్రయమన్నారు. ప్రజలపై ధరల భారం తగ్గించాలని ఉద్దేశంతో ఇది అమలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

అయితే.. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందిస్తోంది. ప్రభుత్వం నేటి నుంచి దేశవాళి కందిపప్పు కిలో రూ.160, నాణ్యమైన స్టీమ్‌ రైస్‌ (బీపీటీ రకం) కిలో రూ.49, రారైస్‌ కిలో రూ.48 చొప్పను విక్రయిస్తున్నారు. ఒక్కో వినియోగదారుకు బియ్యం 5 కిలోలు, కంది పప్పు కిలో పంపిణీ చేస్తున్నారు.